Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్మొద్దు నిద్రకు మూల్యమిది..

మొద్దు నిద్రకు మూల్యమిది..

మొద్దు నిద్రకు మూల్యమిది..
భవన నిర్మాణ అనుమతుల జాప్యంపై అధికారులకు ఫైన్
జీడబ్ల్యూఎంసీలోని 9 మందికి రూ.3 వేల చొప్పున జరిమానా

స్పాట్ వాయిస్, కార్పొరేషన్ : టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం చేసిన బల్దియాకు చెందిన 9 మంది అధికారులకు జరిమానా విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో భవన నిర్మాణాల కోసం వచ్చిన దరఖాస్తులలో జాప్యాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తూ 90 మంది అధికారుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల అపరాధ రుసుము చొప్పున రూ.2.52 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతుల్లో జాప్యం వహించిన బల్దియా పట్టణ ప్రణాళిక 9 మంది అధికారుల జీతభత్యాలు నుంచి జరిమానా రికవరీ చేస్తున్నట్లు సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments