Saturday, June 7, 2025
Homeక్రైమ్పశువుల కొట్టంలో పేకాట..

పశువుల కొట్టంలో పేకాట..

పశువుల కొట్టంలో పేకాట
పట్టుకున్న పోలీసులు
స్పాట్ వాయిస్ , భూపాలపల్లి టౌన్ : పశువుల కొట్టంలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి శివారులో కొంత మంది పేకాట ఆడుతున్నారనే సమాచారం రాగా భూపాలపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సీఐ ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడి చేశారు. కొంపల్లి శివారులోని భోగి సమ్మయ్య పశువుల కొట్టం పై దాడి చేయగా అక్కడ 15 మంది పేకాట పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 15, 040/ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments