Monday, November 25, 2024
Homeక్రైమ్కాపురం ఇష్టంలేకే హత్యాయత్నం

కాపురం ఇష్టంలేకే హత్యాయత్నం

కాపురం ఇష్టంలేకే హత్యాయత్నం
పరకాల ఏసీపీ శివరామయ్య
స్పాట్ వాయిస్,దామెర: ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే భర్త పై దాడి చేసిందని ఏసీపీ శివరామయ్య తెలిపారు. మంగళవారం పరకాల ఏసీపీ శివరామయ్య మాట్లాడుతూ… హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజుకు నెల రోజుల క్రితం ఆత్మకూర్ మండలం మల్కపేట గ్రామానికి చెందిన హేమలత ( అర్చన )తో వివాహం జరిగింది. అయితే హేమలత తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అతనితో కాపురం చేయడం ఇష్టం లేదని పలుమార్లు చెప్పింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున హేమలత తన భర్త రాజును చంపాలనే ఉద్దేశంతో సదరు రాజు నిద్రలో ఉండగా బ్లేడ్ తో అతని మెడపై కోసేందుకు ప్రయత్నిచింది. అతడు లేచి అరుస్తూ ఇంట్లో నుంచి బయటకు పారిపోయి తప్పించుకున్నాడు. సోమవారం సాయంత్రం మాడిసేట్టీ రాజు తన భార్యపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై హరిప్రియ ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. మంగళవారం హేమలత దామెర పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది. తదనంతరం ఘటనలో ఉపయోగించిన వస్తువులైన బ్లేడ్, కారం పొడి లను ఆమె చూపించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం కోర్టులో హాజరుపరచగా…న్యాయమూర్తి ఆదేశాల మేరకు హేమలత రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై హరిప్రియ, ఏ ఎస్సై లు, సిబ్బంది ని పరకాల ఏసీపీ శివరామయ్య అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments