రేపు కేబినెట్ మీటింగ్..
కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం గురువారం జరగనుంది. సీఎం కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశం కానుండగా..కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత ఈడీ విచారణ , ఒకవేళ అరెస్టయితే ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని కవితకు భరోసా ఇచ్చారు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం చేద్దామని తన కుమార్తె కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందంటూ కవితకు చెప్పారు. కాగా ఈ నెల 10న గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. దీనికోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన విషయం తెలిసిందే.
రేపు కేబినెట్ మీటింగ్..
RELATED ARTICLES
Recent Comments