Tuesday, December 3, 2024
Homeతెలంగాణమంత్రివర్గ విస్తరణ లేనట్టే..

మంత్రివర్గ విస్తరణ లేనట్టే..

టీపీసీసీ చీఫ్ కూడా అంతే..
ముఖ్యనేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం..
వాయిదా వేయడమే సరైందిగా భావన..
మళ్లీ ఎప్పటికో.. పదవులు..?
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ ప్రెసిడెంట్ నియామకంపై ఉత్కంఠ నెలకొనగా.. నీళ్లు చల్లినట్లుగా.. వాయిదా పడింది. ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు సమాచారం. వారం, పది రోజుల తర్వాత దీనిపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని ఒక అభిప్రాయానికి వచ్చినా, ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి కొంత సమయం పడుతుందని నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసి ఆ తరువాత చర్చించడం మంచిదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ భేటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీల సమక్షంలో జరిగింది. నేతల అభిప్రాయాలను అధిష్టానం అడిగి తెలుసుకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments