Saturday, September 21, 2024
Homeటాప్ స్టోరీస్కేబినెట్ నిర్ణయాలు ఇవే...

కేబినెట్ నిర్ణయాలు ఇవే…

కేబినెట్ నిర్ణయాలు ఇవే…

కీలక అంశాలపై చర్చ

స్పాట్ వాయిస్, బ్యూరో 

* సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

* హైడ్రాకు అవసరమైన సిబ్బందిని పలు విభాగాల నుంచి డిప్యుటేషన్పై రప్పిస్తున్నామని వెల్లడించారు. ఆ విభాగానికి 169 మంది అధికారులు, 964 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయిoచనున్నారు.

* ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు రూ.4637 కోట్లు మంజూరు చేశారు.

* రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించారు.

* ఈ ఖరీఫ్‌ నుంచి ఎంఎస్‌పీకి అదనంగా రూ.500 చెల్లించి సన్నాలు కొనుగోలు.

*ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్లో చేర్చారు.

* ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం.

* మనోహరాబాద్లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

* 8 మెడికల్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం. 3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల.

* ఏటూరునాగారం అగ్నిమాపక స్టేషన్కు 34 మంది సిబ్బంది మంజూరు.

* కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల, హకీo పేటలో జూనియర్‌ కళాశాల మంజూరు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments