Saturday, November 23, 2024
Homeరాజకీయంఓరుగల్లులో ఉప ఎన్నిక..!

ఓరుగల్లులో ఉప ఎన్నిక..!

రేపే డెడ్ లైన్.. నిర్ణయం ఎంటి..?
తూర్పులో ఉత్కంఠ
నన్నపునేని సమాధానం కోసం ఎదురుచూపు..
ప్రదీప్ రావు సవాల్ స్వీకరించేనా..? తోక ముడిచేనా..!
స్వీకరిస్తే మరో ఉప ఎన్నికే..

స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో డెడ్ లైన్ టెన్షన్ చెమటపుట్టిస్తోంది. మాటలతో పుట్టిన రోజున మంటలు పుట్టించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సవాల్ స్వీకరిస్తారా..? తొడగొట్టి.. ఫైర్ అయిన ఆయన అదే ఫైర్ కొనసాగిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ ను వీడుతున్నారనే వార్తలు గుప్పుమనడంతో నన్నపునేని నరేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఎమ్మెల్యే వ్యా్ఖ్యలపై సీరియస్ అయ్యారు. ‘నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నువ్వు కార్పొరేటర్ అవకాశం కోసం నా కాళ్లు పట్టుకున్నావంటూ తూర్పునియోజకవర్గంలో పోస్టర్లు వేశారు. రాజీనామా చేసి తనపై గెలువాలని ఇందుకు 10వ తేదీ డెడ్ లైన్ విధించారు. దీంతో తూర్పు రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
రేపు 10వ తేదీ..
ఎర్రబెల్లి ప్రదీప్ రావు తన సవాల్ స్వీకరించాలంటూ విధించిన డెడ్ లైన్ రానే వచ్చింది. బుధవారం 10వ తేదీన దమ్ముంటే రాజీనామా చేయాలనే సవాల్ విసురుతూ సవాళ్ల పోస్టర్లు వెలిశాయి. మరిదీనిపై ఎమ్మెల్యే నరేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని తూర్పు ప్రజలు వేచిచూస్తున్నారు. ప్రదీప్ రావు సవాల్ స్వీకరించి రాజీనామా చేస్తారా..? లేదంటే తోకమూడుస్తారా.. అనేది తెల్లవారితే కానీ తెలియదు. రాజీనామా చేస్తే.. మునుగోడు ఉప ఎన్నికతో వరంగల్ తూర్పు ఉప ఎన్నిక సైతం జరుగుతుందని, ఇక్కడ వరాల జల్లుల కురుస్తాయని ఆశిస్తున్నారు.
‘బుద్ధిలేని ఎమ్మెల్యే’
నాడు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాళ్లావేళ్ల పడ్డ నువ్వు, ఈరోజు స్థాయి మరిచి మాట్లాడుతున్నావు నన్నపనేని నరేందర్ అంటూ ప్రదీప్ రావు ఘాటుగా స్పందించారు. ఇదే కాకుండా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పోటీచేసే దమ్ము నాకుంది.. నరేందర్ నీకు ఆగస్టు 10వరకు టైం ఇస్తున్న.. ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన బిడ్డగా పౌరుషం ఉంటే సవాల్ స్వీకరించు.. లేదా చేతకాదు అని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పు బుద్ధిలేని (నన్నపునేని )నరేందర్ అంటూ వాల్ పోస్టర్ లు వెలువడటంతో నియోజకవర్గంలో కలవరంతో పాటు రాజకీయ దుమారం రేగుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments