ఆ తర్వాతే మిగతా చోట్ల..!
సీఎం రేవంత్ వ్యూహం
అనర్హత పిటిషన్ విషయంలో నయా ప్లాన్
స్పాట్ వాయిస్, బ్యూరో: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నది. ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై మాత్రమే అనర్హత వేటు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం ఖైరతాబాద్ లో ఉప ఎన్నికకు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నది కాంగ్రెస్ వాదనగా తెలుస్తోంది. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీంతో కాంగ్రెస్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చేలా రేవంత్ వ్యూహం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో రెండు సార్లు కాంగ్రెస్ శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని బీఆర్ఎస్.. హస్తాన్ని భారీ దెబ్బకొట్టింది. దీంతో రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ కోలుకోదన్న చర్చ కూడా తీసుకువచ్చింది. ఇందుకు కారణమైన బీఆర్ఎస్ పై రేవంత్ పగ తీర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారన్న చర్చ సాగుతోంది.
గతంలో శ్రీధర్ బాబుకు ఇవ్వకుండా ఎంఐఎంకు..
గతంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. అయితే.. తన మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఆ పదవి ఇచ్చింది బీఆర్ఎస్. అప్పట్లో తమకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వనందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కు ఆ పదవి రాకుండా చేసి వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాడని తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోందని తెలుస్తోంది.
స్పీకర్ నిర్ణయమే ఫైనల్
ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ మాత్రమే నిర్ణయమే ఫైనల్ కావడంతో దీన్ని అస్త్రంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లు స్పీకర్ తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది. మిగతా ఎమ్మెల్యేలు ఇంకా టెక్నికల్ గా బీఆర్ఎస్ తోనే ఉన్నారు. ఇందులో భాగంగానే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని కాంగ్రెస్ చెబుతోంది. అరికెపూడి గాంధీ సైతం తాను అసలు కాంగ్రెస్ కండువానే కప్పుకోలేదని నిన్న వ్యాఖ్యానించారు. దీంతో 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని భావించి స్పీకర్ వారిపై అనర్హత వేయకుండా ఉండే అవకాశం ఉంది.
కేవలం ఖైరతాబాద్ లోనే..!
కేవలం దానం నాగేందర్ పై మాత్రమే స్పీకర్ వేటు వేసేలా చేయాలన్నది రేవంత్ మరో వ్యూహంగా తెలుస్తోంది. లేకుంటే దానంను రాజీనామా చేయించి.. అక్కడ ఉప ఎన్నికకు వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన అని సమాచారం. ఇందులో భాగంగానే దానం నాగేందర్ తాను ఖైరతాబాద్‌లో ఉపఎన్నికకు రెడీగా ఉన్నాన ఇటీవల వ్యాఖ్యానించారన్న చర్చ సాగుతోంది.
Recent Comments