Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్..!

రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్..!

రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్..

నేడే బాహుబలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర సర్కార్

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ మొదటిసారి మూడు లక్షల కోట్ల మార్కు దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడంతో భారీ బడ్జెట్ ను సిద్ధం చేశారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తూ పద్దును ప్రతిపాదించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షలా 56 వేల కోట్లు కాగా వచ్చే ఏడాది వృద్ధిరేటు 15 నుంచి 17 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. దీంతో 2023- 24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో సంక్షేమ రంగానికి సింహభాగం నిధులు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు నిధులు పెరిగాయి. సొంత రాబడిపైనే ఎక్కువగా ఆధారపడి పూర్తి విశ్వాసంతో ఆశావాహ బడ్జెట్‌ను రూపొందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments