బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్..
గ్రేటర్ వరంగల్ లో కలకలం..
ఖమ్మం జైలుకు వేముల శ్రీనివాస్
నిందితుడు చీఫ్ విప్ దాస్యంకు అంత్యంత సన్నిహితుడు
స్పాట్ వాయిస్, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ లో అధికార పార్టీకి భారీ కుదుపు. ల్యాండ్ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం సెకండ్ అడిషనల్జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్‌మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్డెవలప్మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్ ఓనర్ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్మీదికి వెళ్లి కాంపౌండ్‌వాల్‌ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సీపీ ఏవీ రంగనాథ్ఆదేశాలతో కార్పొరేటర్వేముల శ్రీనివాస్‌తో పాటు అతడి డ్రైవర్పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్ జేఎఫ్‌సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్..
RELATED ARTICLES
Recent Comments