Friday, September 20, 2024
Homeతెలంగాణబీఆర్ఎస్‌ నుంచి మరో ఎమ్మెల్యే జంప్..

బీఆర్ఎస్‌ నుంచి మరో ఎమ్మెల్యే జంప్..

కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్‌ఎస్​కు షాక్​లు మీద షాక్​లు తగలుతున్నాయి. ఒకవైపు కేసీఆర్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో వరుసగా సమావేశాలు పెడుతూ.. భవిష్యత్ మనదే అని చెబుతున్నా.. జంపింగ్ లు మాత్రం ఆగడం లేదు. లోక్ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా బీఆర్ఎస్​ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్​ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ఎమ్మెల్యే యాదయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇప్పటివరకు ఆరుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్​కు ఇప్పటివరకు ఉన్న 65 సభ్యులు, సీపీఐతో కలిపి 66కు ఉండగా.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు చేరడంతో 72కు చేరింది. ఇప్పుడు శాసనసభలో బీఆర్​ఎస్​కు 32 మంది, బీజేపీకి 8 మంది, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments