Monday, November 25, 2024
Homeతెలంగాణగ్రేటర్ వరంగల్ నుంచి చేరేది వీరే..

గ్రేటర్ వరంగల్ నుంచి చేరేది వీరే..

మరికొద్ది సేపట్లో కండువా కప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: బీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు, మాజీలు, డివిజన్ అధ్యక్షులు మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో క్యాంపులో ఉన్న వీరంతా సీఎం రేవంత్ రెడ్డి కోసం వేచి చూస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిలో 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత, 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు, 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని భాస్కర్, 21వ డివిజన్ కార్పొరేటర్ పుర్కాన్, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమార్, 24వ డివిజన్ కార్పొరేటర్ ఆకుతోట తేజస్విని శిరీష్, 27 వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్, 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్, 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, మాజీ కార్పొరేటర్లు జారతి రమేశ్, నాగపురి కల్పన సంజయ్, మేడిది రజిత మదుసూధన్, రామా బాబూరావు, మరో 13 డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments