ఉద్యమాల గడ్డపై బీఆర్ఎస్ కు షాక్‌లు..
కాంగ్రెస్ లో చేరిన డీసీసీబీ చైర్మన్ మార్నేని దంపతులు
స్పాట్ వాయిస్, వరంగల్: ఉద్యమాల గడ్డ ఓరుగల్లు లో బీఆర్ఎస్ కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. వీరికి కండువా కప్పి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని మార్నేని దంపతులు కలవనున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు మార్నేని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. మార్నేని అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారే ప్రయత్నం చేయగా కేటీఆర్ చొరవ తో ఆగిపోయారు.
వర్ధన్నపేటలో ఖాళీ అవుతున్న కారు
వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కారును పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల కాలంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్,బీఆర్ ఎస్ పార్టీ ఐనవోలు మండల అధ్యక్షుడు, మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ గూటికి చేరగా,తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ మారినేని రవీందర్ రావు,ఆయన సతీమణి iనవోలు ఎంపీపీ మార్నేని మధుమతి సైతం కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో గత పది సంవత్సరాల కాలంలో కారు పార్టీకి ఎదురేలేదు. కాని ఒక్కసారిగా కారు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అధిక మెజారిటీ వచ్చిన రెండవ నియోజకవర్గంగా రికార్డు ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ ఎస్ పార్టీ ఒక్కసారిగా ఢీలపడుతుంది.
Recent Comments