రాష్ట్రoలో బీఆర్‌ఎస్ చచ్చిoది..
వాళ్లిద్దరూ బిల్లా, రంగాలు
సీఎం రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో బీఆర్‌ఎస్ చచ్చిందని, ఆ పార్టీని ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బొంద పెట్టేశారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. మంగళవారం గాంధీభవన్‌లో భేటీ అయింది. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. కేటీఆర్, హరీశ్ తమ ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాల్సింది దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీనని.. కానీ బిల్లా, రంగాలు ఆ పార్టీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ పై పరుష పదజాలం వాడుతున్నారని, అసలు కాంగ్రెస్ పార్టీ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారని కేటీఆర్, హరీశ్‌పై మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలవరించేందుకు వారు చేసే ప్రయత్నం.. మోడీని మూడోసారి ప్రధానిని చేయడానికి చేసుకున్న చీకటి ఒప్పందమన్న సంగతి ప్రజలకు తెలుసన్నారు. బీజేపీని, మోడీని నిలవరించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని.. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలవుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Recent Comments