Friday, November 22, 2024
Homeరాజకీయంచర్చల్లేవ్.. గిర్చల్లేవ్..

చర్చల్లేవ్.. గిర్చల్లేవ్..

బీ ఫామ్ నాకే.. 

కడియంతో చర్చలు ఉత్తనే..

బాంబ్ పేల్చిన ఎమ్మెల్యే తాటికొండ 

స్పాట్ వాయిస్, బ్యూరో: స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ విభేదాలు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న సమయంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాంబు పేల్చారు. బీ ఫాం తనదేనని ప్రకటించుకున్న ఆయన.. ఒకవేళ సీటు కేటాయించని పక్షంలో పోటీ చేసే విషయం కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసిపోయారనుకునేలోపే ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

డప్పుకొట్టి.. బాంబ్ పేల్చి…

లింగాలగణపురం మండలం వడ్డీచర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డప్పుకొట్టి దరువేశారు. డప్పు, డోలు కొట్టి కార్యకర్తలను ఉత్సాహాపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు కలిశానని, అప్పుడు టికెట్ నీకే అని చెప్పారని ప్రస్తావించారు. కెసిఆర్ఆ  బీ ఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్      లేకపోవడంతో మళ్లీ రెండురోజుల క్రితం సమావేశమైనట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ గానీ, ఎంపీగా కానీ అవకాశం ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకొమ్మని చెప్పారన్నారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఫొటోలు దిగినట్లు తెలిపారు. ఆ ఫోటోకు ఊహాగానాలతో మీడియాలో వచ్చిన కథనాలతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. కడియంతో ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీఫామ్లు ఇవ్వలేదన్న రాజయ్య.. కొన్ని నియోజక వర్గాలలో డిస్టబెన్స్ జరుగున్నాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments