కనుల పండువగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీలో గులాబీ జెండా రెపరెపలాడింది. సర్దార్ పటేల్ రోడ్‌లో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:39 నిమిషాలకు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి.. కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జాతీయ అధ్యక్షుడి చైర్ లో కూర్చున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలకు చేరుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో కేసీఆర్ పాల్గొన్నారు.
గులాబీ మయం
బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్‌పటేల్ రోడ్డు గులాబీమయమైంది. ఎస్పీ రోడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. మరోవైపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు హస్తినకు చేరుకున్నారు. సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
Recent Comments