Thursday, March 13, 2025
Homeతెలంగాణనాయిని నెలల బాలుడు..

నాయిని నెలల బాలుడు..

నాయిని నెలల బాలుడు..
16 నెలల అనుభవశాలి అంతా తెలుసనుకుంటున్నాడు..
తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది..
స్వయంగా యంత్రాంగం అవినీతిపై మాట్లాడి మరిస్తే ఎలా..
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
పశ్చిమ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనం..
రాజేందర్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలి..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ: బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగ‌కు ఓరుగ‌ల్లు వేదిక కానుందని, తెలంగాణ ఉద్యమంలో వ‌రంగ‌ల్‌ది ప్రత్యేక స్థానమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండ పార్టీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమ స‌మ‌యంలో రాజేంద‌ర్ రెడ్డి చేతిలో, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో పిస్టల్‌, రైఫిల్ ఉంద‌న్న విష‌యం మ‌ర్చిపోవద్దన్నారు. మీరు , మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమ‌ర్శిస్తున్నారని, కానీ ఇదే కేసీఆర్ ఉద్యమించ‌క‌పోతే మీకు, మీ ముఖ్యమంత్రికి ప‌ద‌వులు ఎక్కడివని ప్రశ్నించారు. రాజేంద‌ర్ రెడ్డి, రేవంత్ రెడ్డి… ఇద్దరు ఉద్యమ స‌మ‌యంలో ఉద్యమ ద్రోహుల‌కు స‌ద్దులు క‌ట్టారని, ఉద్యమానికి ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలంగాణ స‌మాజం మ‌ర్చిపోదని, మీరు ఉద్యమ నాయ‌కుడు హ‌రీష్ రావు గురించి మాట్లాడ‌డం సిగ్గుచేటు అని అన్నారు. మానుకోట ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 25 ఏండ్ల పండుగ‌ను వ‌రంగ‌ల్ వేదిక‌గా నిర్వహించుకోనుండ‌గా… ఇలా చిల్లర మాటలు మాట్లాడ‌డం స‌బ‌బు కాదన్నారు. రాజ‌కీయాల్లో ఇది మంచి ప‌రిణామం కాదని, మీ పార్టీ గురించి, మీ నాయ‌కుల గురించి మేము కూడా మాట్లాడ‌గ‌ల్గుతామన్నారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శల‌కు ఓ హ‌ద్దు ఉంటుందని, చిల్లర మాటలు మాట్లాడొద్దని సూచించారు. రాజేంద‌ర్ రెడ్డి ప్రతీ సారి అభివృద్ధి, అభివృద్ధి అని మాట్లాడుతున్నాడని, ఆయనేదో ఈ న‌గ‌రాన్ని నిర్మించిన‌ట్లు , మ‌రో చంద్రబాబులా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితిలో మీరు ఉన్నారని, ఇంకొన్ని రోజులైతే ప్రజ‌ల్లో తిర‌గ‌లేరని విమర్శించారు.
నాయిని ఎక్కువగా ఊహించుకుంటున్నాడు..
ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందని తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వ‌రంగ‌ల్ జిల్లాను అభాసుపాలు చేసేందుకు కొంద‌రు నాయ‌కులు బ‌య‌లుదేరారని ఎద్దేవా చేశారు. ఎంతో విశిష్ట అనుభ‌వం ఉన్న హ‌రీష్ రావు మాట్లాడి వెళ్లిన త‌ర్వాత ఈ 16 నెల‌ల కిడ్ హ‌న్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి ఈ ప్రపంచ అంతా తనకు తెలుసని, ఈ న‌గ‌రమంతా తెలుసని తనకు తాను ఎక్కువగా ఉహించుకుంటున్నాడన్నారు. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల కనీస అవసరాలైన నీరు, విద్యుత్ స‌క్రమంగా అందించాలని, మెరుగైన పారిశుధ్య సౌక‌ర్యాలు క‌ల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే నాయిని ప్రజాప్రతినిధులు లంచ‌వ‌తారాలుగా మారుతున్నారని, మున్సిప‌ల్‌లో అవినీతి ఎక్కువైంద‌ని అన్నాడని, అంటే నీ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి కూడా మున్సిప‌ల్ ప‌రిధిలో ఉందని, దీన్ని బట్టి నీ పని విధానాన్ని చెప్పొచ్చన్నారు. ఎమ్మెల్యేల మాట‌లు కోట‌లు దాటుతున్నాయని, పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కానీ చేత‌ల్లో మాత్రం పనుల్లేవన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments