ఎస్పీ ఆఫీసు ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. మహబూబాబాద్‌లో గురువారం తలపెట్టాల్సిన ఈ రైతు మహా ధర్నాకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి కోసం రెండు రోజులుగా పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం స్పందించలేదు. దీంతో వెంటనే అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు బైఠాయించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరావు, తక్కెల్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments