Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి అనుమతుల్లేవా..?

బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి అనుమతుల్లేవా..?

హన్మకొండ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు
అనుమతి చూపించాలన్న మున్సిపల్ అధికారులు
ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదు మేరకు.. దాస్యంకు నోటీస్
మూడు రోజులే ఛాన్స్..
బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్..

స్పాట్ వాయిస్, ఓరగుల్లు: హన్మకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయానికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాల సముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి అనుమతులు లేవంటూ హనుమకొండ జిల్లా బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడికి తెలంగాణ మునిసిపాలిటీల చట్టం- 2019లోని సెక్షన్ 254 కింద నోటీసు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కాజీపేట సర్కిల్ నుంచి ఈ నోటీసులు జూన్ 25వ తేదీన జారీ అయ్యాయి. నోటీసులు జారీ సమాచారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను మూడు రోజుల్లో అనుమతి పాత్రలు అందజేయాలని లేదంటే మున్సిపల్ చట్టం 2019లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీస్ లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

అనుమతుల్లేవా..?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించుకుంది. ఆయా కార్యాలయాలకు స్థలాలను కూడా ప్రభుత్వం వద్దనే తీసుకున్నారు. నిర్మాణాలు చేశారు. అయితే వరంగల్ పార్టీ ఆఫీసుకు మాత్రం అనుమతులు లేవని నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అంతే కాదు పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను సమర్పించాలని అధికారులు ఆదేశించారు. నోటీసుల సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు కేవలం మూడు రోజులు గడువు మాత్రమే ఇచ్చారు. దాదాపుగా వారం పూర్తయింది. ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments