బీఆర్ఎస్ నేతల తిప్పలు..
ఖాళీ అవుతున్న గ్రేటర్ వరంగల్
కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్న నేతలు
బుజ్జగింపులు చేస్తున్న స్థానిక లీడర్లు..
అధినేతల వద్దకు ప్రయాణం..
స్పాట్ వాయిస్, వరంగల్: గ్రేటర్ వరంగల్‌లో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోల్పోగానే.. కారు దిగేవారి సంఖ్య ఓరుగల్లు నుంచి భారీగా పెరిగిపోయింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యతో మొదలైన పార్టీ రాజీనామాలు.. నేటికీ ఆగడం లేదు. రోజుకో ప్రధాన లీడర్ హస్తం గూటికి చేరుతున్నారు. ఇన్నాళ్లు గులాబీ పార్టీకి కంచుకోట లాంటి ఉద్యమాల గడ్డ వరంగల్ లో ఆ పార్టీ అధ్వన్న స్థితికి చేరుకుంది. మొన్నటికి మొన్న గ్రేటర్ వరంగల్ లో 11 మందికి పైగా కార్పొరేటర్లు ఒకేసారి కాంగ్రెస్ లోకి చేరారు. ఎన్నికల సమయంలో ఒకరిద్దరు పోగా.. ఇప్పుడు భారీగా చేరారు. ఇక మేయర్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అన్నట్లుగా ఇండికేషన్ ఇచ్చారు. ఇలా కీలక నేతలంతా పార్టీ మారుతుండడంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
కాపాడుకునే ప్రయత్నం..
వరంగల్ కు చెందిన బీఆర్ఎస్ నేతలు పార్టీ శ్రేణులను, కీలక నాయకులను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ గులాబీకి దూరమయ్యే పరిస్థితి నెలకొనడంతో.. ఇప్పుడు అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. కార్పొరేటర్లను కాపాడుకునేందుకు బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పలువురు కార్పొరేటర్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. డిప్యూటీ మేయర్ రిజ్వనా శమిమ్ మాసూద్, కార్పొరేటర్లు మారుపల్ల రవి, పల్లం పద్మరవి, సిద్ధం రాజు, గందె కల్పన-నవీన్, బోగి సువర్ణ సురేష్ తదితరులు ఉన్నారు. వీరికి కేటీఆర్ పార్టీ మారొద్దని, మున్ముందు మనకే మంచి రోజులున్నాయని చెప్పినట్లు సమాచారం.
రంగంలోకి దిగిన హరీష్‌రావు
గ్రేటర్ వరంగల్ నుంచి మరో ఆరుగురు బీఆర్‌ఎస్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వీరంతా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును 6 కార్పొరేటర్లు కలిసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసుకున్న అధిష్టానం చర్యలకు దిగింది. కార్పొరేటర్లు కాంగ్రెస్‌కు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగారు. కార్పొరేటర్లకు ఫోన్ చేసి మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ మనదే, కలిసి పనిచేద్దామని మాజీ మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే హరీష్‌రావు బుజ్జగించినప్పటికీ ఒకరిద్దరు మినహా మిగిలిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కార్పొరేటర్ల కావలి..
RELATED ARTICLES
Recent Comments