Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్యూపీ మాజీ సీఎం మృతి

యూపీ మాజీ సీఎం మృతి

యూపీ మాజీ సీఎం మృతి

స్పాట్ వాయిస్‌ , డెస్క్: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం 8:30 గంటలకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ములాయం సింగ్ ఆగస్టు 22న మేదాంత ఆసుపత్రిలో చేరి, అక్టోబరు 1న ఐసీయూలో కి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు,   తదితరులు సంతాపం తెలిపారు.

తిరుగులేని నేత…..

ములాయం సింగ్ యాదవ్ ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్‌ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్‌ యాదవ్‌ దంపతులకు జన్మించారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యడిగా 10 సార్లు, లోక్​సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments