Saturday, November 23, 2024
Homeతెలంగాణబీపీ పెరుగుతోంది.. జాగ్రత్త

బీపీ పెరుగుతోంది.. జాగ్రత్త

కరోనా అనంతరం పెరుగుతున్న కేసులు
బాధితుల్లో ఎక్కువగా 30 ఏళ్లలోపు వారే..
మారిన జీవన విధానమే కారణం..
450 ఆయూష్ వెల్నెస్ కేంద్రాల్లో యోగా, ఫిట్ నెస్ ప్రోగ్రామ్స్
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
వణుకుపుట్టిస్తున్న సర్వే రిపోర్ట్

స్పాట్ వాయిస్, హైదరాబాద్: కరోనా అనంతరం బీపీ బాధితుల సంఖ్య భారీగా పెరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తాజ్​డెక్కన్​లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ హాస్పిటల్స్, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన కొవిడ్ తర్వాత రక్తపోటు సర్వే రిపోర్టును ఆయన విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిగల్స్ గ్లోబల్, కార్డియోలాజికల్ సొసైటీ సర్వే ఫలితాలు బాధ కలిగిస్తున్నాయని, కొవిడ్ తర్వాత బీపీ బాధితులు ఎక్కువయ్యారని చెప్పారు. ఇందులో 30 ఏళ్ల వాళ్లే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్​సీడీ స్క్రీనింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 13 లక్షల మందిలో బీపీ ఉన్నట్టు గుర్తించామన్నారు. రానున్న 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం ఎన్​సీడీ స్క్రీనింగ్ పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. భారత్‌లో ఎన్​సీడీ స్క్రీనింగ్ చేస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. బీపీని కంట్రోల్ చేసుకోవడం అవసరమని, బీపీ, షుగర్ ఉన్న వారిలో 60 శాతం మంది కిడ్నీ బాధితులుగా మారుతున్నారని చెప్పారు.

ప్రజలు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పని ఒత్తిడిలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్​ ఫోన్లు వచ్చాక ప్రజల జీవనవిధానంలో మార్పు వచ్చిందని, ఆహారపు అలవాట్లు సైతం బాగా మారిపోయాయన్నారు. శారీరక శ్రమ బాగా తగ్గి ఊబకాయం పెరిగిందన్నారు. ప్రజలకు ఉచితంగా మందులు ఇచ్చే లక్ష్యంతో ఎన్​సీడీ కిట్​ ప్రారంభించామని, అలాగే కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి.. బాధితులు మందులు సరిగా వాడుతున్నారా లేదా అని తెలుసుకుంట్టున్నట్లు చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేసి బీపీ, షుగర్ మందుల డోస్ నిర్ణయిస్తామన్నారు. ప్రజల్లో బీపీ, షుగర్​పై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. నిత్య జీవితంలో శారీరక శ్రమ అవసరమని, ఇందుకోసం . 450 ఆయుష్​ వెల్నెస్ కేంద్రాల ద్వారా యోగా, ఫిట్​నెస్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments