స్పాట్ వాయిస్, కమలాపూర్ : కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన శ్రీరాముల సంతోష్- ఉమా దంపతుల కుమారుడు శ్రీహాన్ష్ (3) నీటి సంపులో పడి మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం శ్రీహాన్ష్ ఆడుకుంటూ వెళ్లి సంపులో పడ్డాడని, కొద్ది సేపు తరువాత తల్లి వెతకగా బాలుడు సంపులో విగత జీవిగా కనిపించాడు. బాలుడు మృతి తో కుటుంబంలో విషాదం నెలకొంది.
Recent Comments