Wednesday, April 16, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు

ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు

స్పాట్ వాయిస్, నర్సంపేట : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతు కావడంతో నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో సోమవారం విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇటుకాలపల్లికి చెందిన యామంకి సుమలత, రవి దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్న కుమారుడు శ్రీనాధ్ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి చింతల చెరువుకు ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే సాయంత్రం అయినా శ్రీనాధ్ ఇంటికి రాకపోవడంతో ఖంగారు పడిన కుటుంబసభ్యులు, స్థానికులు చింతల చెరువు పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో చెరువును ఆనుకొని ఉన్న దొర బావి పక్కన శ్రీనాధ్ దుస్తులు కనిపించాయి. దీంతో బాలుడు అదే చెరువులో ఈతకు దిగి బయటకు రాకపోవచ్చనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే నర్సంపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలుడి కోసం బావిలో గాలింపు చర్యలు చేపపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments