బీజేపీకి ఆ ఇద్దరు గుడ్ బై
రేపోమరునాడో కాంగ్రెస్ లో చేరిక
రసవత్తరంగా రాష్ట్ర రాజకీయాలు
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంకా 37 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్లోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళ, బుధవారం లో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వారు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయమై తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వివేక్ కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరోలో ఉంటారని సమాచారం.
Recent Comments