Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుసంస్కృతి కాపాల్సిన బాధ్యత మనందరిది

సంస్కృతి కాపాల్సిన బాధ్యత మనందరిది

సంస్కృతి కాపాల్సిన బాధ్యత మనందరిది
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
పార్టీ శ్రేణులు, స్థానికులతో కలిసి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి, బావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని వడ్డేపల్లి, వెంకటాద్రి నగర్, సోమిడి, బోడగుట్ట, కాజీపేట ప్రాంతాల్లో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఆషాడం, శ్రావణ మాసాల్లో జరిగే అమ్మవారి బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుందని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యంతో ఉండాలని, పాడి పంటలు సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటారన్నారు. ఇలాంటి ఉత్సవాలే సనాతన ధర్మానికి ఆయువు పట్టు అని, వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనా్నరు. సోషల్ మీడియా యుగంలో, పాశ్చాత్య సంస్కృతిని పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా యువత అమ్మవారి ఉత్సవాలపై మక్కువ ప్రదర్శించడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments