Tuesday, November 26, 2024
Homeటాప్ స్టోరీస్బీజేపీ నుంచి రాణా ప్రతాప్ సస్పెన్షన్

బీజేపీ నుంచి రాణా ప్రతాప్ సస్పెన్షన్

బీజేపీ నుంచి రాణా ప్రతాప్ సస్పెన్షన్

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో వేటు..

వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్..

స్పాట్ వాయిస్ నర్సంపేట : భారతీయ జనతా పార్టీ నుండి నర్సంపేట యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేశారు. నిన్న నర్సంపేటలోని పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి జరిగిన విషయం విదితమే. ఈ దాడి లో పాల్గొన్నవారు రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు కావడంతో అయన ప్రమేయంతోనే దాడి జరిగినట్లు భావించి అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొండేటిశ్రీధర్ తెలిపారు. శుక్రవారం నర్సంపేట పట్టణం లోని పార్టీ కార్యాలయంలో అయన మాట్లాడారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబందిందించి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, పాలడుగుల జీవన్, గడ్డం ఆంజనేయులు, తడకా అశోక్ చిల్పూర్ నాగరాజు లను సస్పెండ్ చేశామని తెలిపారు. వారంతా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, గతంలో వీరికి రెండుసార్లు నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు.అయినా తీరు మారకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments