ఇందిరమ్మ కమిటీలు రద్దు చెయ్యాలి.
పార్టీలకు అతీతంగా పేదలకు ఇండ్లు అందించాలి.
బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తడక వినయ్ గౌడ్
స్పాట్ వాయిస్ నల్లబెల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందిoచాలని నల్లబెల్లి బీజేపీ మండల ప్రధానకార్యదర్శి తడుక వినయ్ గౌడ్ అన్నారు. మండలంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు అందాలని గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2లక్షల ఇళ్లను మంజూరు చేయగా కనీసం బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వాటి ఊసే తీయకుండా పేద మధ్య తరగతి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రభుత్వం అంటూ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంల కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇళ్లను ఇందిరమ్మ ఇల్లుగా చెప్పుకుంటూ కాలయాపన చేయకుండా పార్టీలకతీతంగా పేద ప్రజలకు ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలను రద్దు చేసి ప్రభుత్వ అధికారుల ఆధీనంలోనే అర్హులైన పేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చూడాలన్నారు.
Recent Comments