Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్గుండ్ల పాడు సర్పంచ్ ను సస్పెండ్ చేయాలి

గుండ్ల పాడు సర్పంచ్ ను సస్పెండ్ చేయాలి

దళితుడి పై దాడి దారుణం
రాష్ట్ర ఎస్సీ కమిషన్ కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి : మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన దళితుడు తాటికాయల సూరయ్యపై దాడికి పాల్పడిన సర్పంచ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. నర్సంపేటలోని ఆస్పత్రిలో చికిత్సై పొందుతున్న సూరయ్యను కొండేటి శ్రీధర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయని, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ కట్టయ్య గ్రామ ప్రథమ పౌరుడిగా ప్రజలందరిని కాపాడుకోవాల్సిన బాధ్యత గల వ్యక్తి దళితులపై వివక్ష చూపుతూ సూరయ్య అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని, సర్పంచిగా కొనసాగే హక్కు ఆయనకు లేదని, వెంటనే ఆయనను సర్పంచ్ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా చేసి సర్పంచ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. సూరయ్య పై జరిగిన దాడి విషయాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారావులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బాల్నే జగన్, మహంకాళి జిల్లా ఇన్ చార్జి ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు బన్న ప్రభాకర్, సీనియర్ నాయకులు త్రిలోక్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వీర ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజు, రామాంజనేయులు, శీలం సత్యనారాయణ, మల్యాల సాంబమూర్తి, జిల్లా కమిటీ సభ్యుడు నూనె రంజిత్, నర్సంపేట పట్టణ యువమోర్చా అధ్యక్షుడు గూడూరు సందీప్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్, నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శి రమేష్, మహిళా నాయకులు సింగారపు సుజాత, గోపగాని మౌనిక వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments