నర్సంపేటలో బీజేపీ జెండా ఎగురాలి
అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా..
బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు
నర్సంపేటలో పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన
స్పాట్ వాయిస్, నర్సంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని అ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు కోరారు. బీజేపీ పార్టీ కార్యాలయానికి నర్సంపేటలో మంగళవారం ఆ యన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులకు అందుబాటులో ఉండడానికి, కార్యకర్తలు పట్టణానికి వచ్చినప్పుడు వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లతో పార్టీ ఆఫీసును అతి త్వరలో నిర్మిస్తామన్నారు. తన సొంత ఖర్చులతో ఈ ఆఫీసు నిర్మాణం చేయనున్నట్లు అయన తెలిపారు.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ కార్యాలయంలో 24 గంటలు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యకర్తలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అలాగే వారి కష్టసుఖాలలో కూడా తోడై ఉంటూ వారి బాగోగుల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి నియోజకవర్గంలో కాషాయపు జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీరంగం శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్, నెక్కొండ గిరిజన మోర్చా మండల అధ్యక్షులు జాటోతు అనిల్ నాయక్, బీజేపీ జిల్లా నాయకులు కందుకూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ , రాకేష్ రావు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments