Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలునర్సంపేటలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

నర్సంపేటలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

నర్సంపేటలో బీజేపీ జెండా ఎగరడం ఖాయ

మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

బీజేపీలోకి భారీగా చేరికలు

స్పాట్ వాయిస్ నర్సంపేట : రాబోయే ఎన్నికల్లో నర్సంపేటలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం దుగ్గొండి మండలం మహ్మదాపురంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా బీజేపీలో చేరారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో నర్సంపేట బీజేపీ నాయకులు గోగుల రాణాప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మహ్మదాపురం గ్రామ పార్టీ టీఆర్ఎస్ మాజీ
అధ్యక్షుడు చౌడారపు తిరుపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాలడుగుల జీవన్, ఉపసర్పంచ్ నేదురు రాజేందర్, 3వ వార్డ్ సభ్యులు బొల్లేపల్లి రాధిక కిరణ్, 9వ వార్డు సభ్యులు ఎద్దు కృష్ణంరాజు, గ్రామపంచాయతీ కో ఆప్షన్ సభ్యులు గోగుల రాజిరెడ్డి, పొన్నం రాజేందర్, మత్యశాఖ అధ్యక్షులు మంద భిక్షపతి, ఉపాధ్యక్షులు ముద్రబోయిన నర్సింహస్వామి, ఆర్ఎంపీ అధ్యక్షుడు ముద్రబోయిన రాంరాజ్, టీఆర్ఎస్ యూత్ కార్యదర్శి నన్న నరేష్ తో పాటు సుమారు 70 కుటుంబాలకు చెందిన వారు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్రంలో యువకులు మాత్రం ఉద్యోగాలు లేవన్నారు. మోడీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నాయని భారత్ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. నర్సంపేట అభివృద్ధి నేను చేసిందే తప్ప ఇప్పుడు గొప్పలు చెప్పుకొనే నాయకులు నర్సంపేటలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు. రాష్టంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని దానికోసం యువకులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఊరూరా తిరిగి పల్లె ప్రగతి అని, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు అని హామీలిచ్చి గద్దెనెక్కి ఇప్పుడు వాటిని విస్మరించడం తగదన్నారు. మహ్మదాపురం లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నీ
వెంటనే అమలు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో అకాల రాళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు కాలయాపన చేయకుండా నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ నర్సింహరాములు, మండల అధ్యక్షుడు చుక్క రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్, జిల్లా అధికార ప్రతినిధి దేవేందర్ గౌడ్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుదర్శన్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి సతీష్, గ్రామ పార్టీ ముక్యులు ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, మండల, గ్రామ, యూత్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments