ఏకకాలంలో ముగ్గురు కీలక నేతల ప్రచారం
స్పాట్ వాయిస్, బ్యూరో: బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు ప్లాన్ చేసింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి , ఎన్నికల ప్రచారణ నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ హనుమాన్ దేవాలయం నుంచి కిషన్‌రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈయన పాదయాత్ర సాగనుంది. కొండగట్టు నుంచి ఈటల పాదయాత్రను ప్రారంభిస్తారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈటల యాత్ర సాగనుంది. భద్రాచలం నుంచి బండి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బండి పాదయాత్ర సాగనుంది.
బీజేపీ.. పాదయాత్ర ప్లాన్
RELATED ARTICLES
Recent Comments