Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్నాకే కన్ఫాం లేదు..

నాకే కన్ఫాం లేదు..

సీఎం అని చెప్పుకునే వారు ముఖ్యమంత్రి కాలేరు..
వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసం పని చేసే వారికే టికెట్లు
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీజేపీలో ముఖ్యమంత్రి అని చెప్పుకునే వారు సీఎం కాలేరని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రెండో విడత పాదయాత్ర సందర్భంగా మంగళవారం బండి మీడియాతో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడైనప్పటికీ.. తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. వ్యక్తుల కోసం పనిచేసేవారికి కాకుండా పార్టీ కోసం కష్ట పడిన వారికే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వస్తాయని పేర్కొన్నారు. టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు.. నాయకులను తిప్పుకుంటున్నారని అన్నారు. తిప్పుకున్న వారికీ.. తిరిగిన వారికీ ఇద్దరకీ టికెట్లు రావని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ సైతం ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments