దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన బీజేపీ నాయకులు
స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన వల్ల నష్టం కాగా, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బాల్నే జగన్ ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ద్వారక పేట 17వ వార్డులో మహారాజుల కాలనీలోని బస్కె భాస్కర్ ఇల్లు నిన్న రాత్రి వడగండ్ల వాన, గాలివాన బీభత్సంతో ఇంటి పైకప్పు ఎగిరి పక్కన పడింది. విషయం తెలుసుకున్న బీజేపీ పట్టణ కమిటీ నియోజవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు జరిగిన పంట నష్టాన్ని, కూలిపోయిన వాటిని ఇంటిపై కప్పు దెబ్బతిన్న వాటిని గుర్తించి వెంటనే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిశీలించిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రాజేందర్, రామాంజనేయులు, యువ మోర్చా అధ్యక్షుడు గూడూరు సందీప్, ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ కుమార్, ద్వారక పేట శక్తి కేంద్ర ఇంచార్జ్ చింతం విజయ రాణి, బూత్ అధ్యక్షులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన బీజేపీ నాయకులు
RELATED ARTICLES
Recent Comments