సిద్ధమైన అధికార పార్టీ
ఆరోపించిన బండి సంజయ్
స్పాట్ వాయిస్, హన్మకొండ: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు. అధికార బలంతో కేసీఆర్ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హన్మకొండలోని అభిరామ్ గార్డెన్లో శుక్రవారం జరిగిన ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నర్సయ్య సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. గుజ్జల నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాగి తందనాలు ఆడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
Recent Comments