పవర్ పై.. బీజేపీ సమర భేరీ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ సమర భేరీ మోగించేందుకు సిద్ధమైంది. ఛార్జీల పెంపుపై ప్రజా బ్యాలెట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం బషీర్బాగ్లో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు బీజేపీ వెల్లడించింది. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ధర్నాలు ఆందోళనలతో ఛార్జీలు తగ్గించే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
Recent Comments