స్పాట్ వాయిస్, నర్సంపేట : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆదివారం నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో బీజేపీ నాయకులు, నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహరాములు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం నర్సంపేటలోని అనాథాశ్రమంలో చిలువేరు రమేష్ రజినీ భారతి దంపతులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు బల్న్ జగన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా పీఎం విశ్వకర్మ పథకాన్ని ఈ రోజు ప్రారంభోత్సవం అయిందన్నారు. కార్యక్రమంలో నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శిలు కొంపెల్లి రాజేందర్, కల్వచర్ల రామాంజనేయ, పట్టణ ఉపాధ్యక్షుడు మల్యాల సాంబమూర్తి, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ జూలూరు మహేష్ గౌడ్, బీజేవైఎం నర్సంపేట అధ్యక్షుడు గూడూరు సందీప్, జిల్లా నాయకులు పంజాల రాము, దుగ్యాల సమ్మయ్య, ఠాగూర్ విజయ్ సింగ్, ఠాగూర్ శివ సింగ్, సామల ప్రవీణ్, చింతం విజయ రాణి, కోమటి సరోజన, వంగ అశోక్, రామకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments