గుడి ముందు చెప్పులూ వదలరు..
ఉమ్మడి వరంగల్ లో దండుపాళ్యం బ్యాచ్..
జర్నలిస్టుల సమస్యలు వింటే కడుపు తరుక్కుపోతోంది..
జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ: బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధిచెప్పేందుకు ఓరుగల్లు సిద్ధమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏకశిల పార్క్ లో మందు సీసాలు, కాళోజీ కళా క్షేత్రం మొండి గోడలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. ఇండ్లిస్తున్న.. దావత్ ఇయ్యాలే అన్న కేసీఆర్ ఒక్క ఇల్లన్నా ఇచ్చిండా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ సర్కార్ కు బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చారని, పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు బిల్లా, రంగాలని, గుడి ముందు చెప్పులు కూడా వదిలేట్టు లేరని ఎద్దేవా చేశారు. ఓరుగల్లులో దండుపాళ్యం ముఠా రాజ్యమేలుతోందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మించిన వ్యక్తి ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆయన హంటర్ రోడ్డులో ఆర్టీసీ ల్యాండ్ ను అప్పనంగా దొబ్బేశాడని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఎక్కడ ఉన్నాయో ,తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో ప్రజలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకుల వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమంగా పెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు తప్పుడు మార్గాల్లో వెళ్లొద్దని సూచించారు. ఇక వరంగల్ జర్నలిస్టుల సమస్యలు ఉంటే కడుపు తరక్కుపోతున్నదని, మోడల్ కాలనీ కట్టిస్తానన్న సన్యాసి ఇటు వైపు చూడలేదన్నారు. ప్రజల సమస్యలు, రాజకీయాలు గురించి రాసే జర్నలిస్టులతో సతమతం అవుతున్నారని చెప్పారు.
నేనే బరిలో ఉంటా..
ఫంక్షన్ హాల్ పర్మిషన్ రద్దు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే అధికారులను పంపించారని హన్మకొండ, వరంగల్ జిల్లాల ఇన్ చార్జ్ నాయిని రాజేందర్ ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో కుల్లుకుతంత్రాలు జరుగుతున్నాయి. నాలుగువందలు ఉన్న సిలిండర్లు 1200లకు పెరిగింది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. వినయ్ భాస్కర్ ఒక్క ఇల్లు ఇచ్చినా.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ ఇన్ చార్జ్ నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఓరుగల్లు జిల్లాలోని 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రూ.వెయ్యి కోట్లకు తక్కువగా లేడని ఆరోపించారు. భూములను కబ్జా చేస్తున్న చిన్నచిన్న చేపలను కాదు.. ఎమ్మెల్యే తిమింగలాను పట్టుకోవాలని సీపీని నాయిని కోరారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈసారి నేనే బరిలో ఉంటానని నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు.
Recent Comments