తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానంటూ పిళ్లై పిటిషన్..
ఉత్కంఠ రేపుతున్న లిక్కర్ స్కాం ఇష్యూ..
స్పాట్ వాయిస్, బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. శనివారం ఎమ్మెల్సీ కవిత విచారణ జరగాల్సి ఉండగా.. శుక్రవారం అరుణ్ రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ అయ్యారు. ఆయన శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు.. ఈడీకి నోటీసులు పంపించింది. ఇదిలా ఉంటే.. రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. నిజానికి 9వ తేదీనే ఆమెను విచారించాల్సి ఉండగా.. ఆమె ముందుగానే ఖరారైన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. 11న విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అరుణ్ రామచంద్ర పిళ్లై ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిళ్లై తన వాంగ్మూలంలో తను కవిత బినామీనని చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. అలాగే ఒక కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయని తెలిపారు. రామచంద్ర పిళ్లై పిటిషన్ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్..
RELATED ARTICLES
Recent Comments