ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే
భూపాలపల్లి పట్టణంలో భారీ ర్యాలీ
కార్మికుల హక్కులను కాపాడుకోవాలి
మోట పలుకుల రమేష్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి పట్టణంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని గనుల వద్ద, కాలనీలో 136వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడే ను పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పతకాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ.. కార్మిక హక్కుల కోసం చికాగో నగరంలో లక్షలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న వారి పైన పెట్టుబడిదారీ వర్గం కాల్పులు చేపట్టడంతో కార్మికుల రక్తంతో తడిసిన జెండా ఎర్ర జెండా అని అన్నారు. కార్మికులు పోరాటాల ద్వారానే హక్కును సాధించుకున్నారు. ఆ హక్కులను కాపాడుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలని కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. స్థానిక కొమురయ్య భవన్ లో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల. రమేష్ , సోతుకు.ప్రవీణ్, విజేందర్ లు జెండాలను ఎగురవేశారు. అన్ని గనుల వద్ద పెద్ద ఎత్తున మేడే ను పురస్కరించుకొని బ్రాంచ్ సహాయ కార్యదర్శులు, ఫిట్ సెక్రటరీలు జి శ్రీనివాస్, నూకల.చంద్రమౌళి, పూరెల్ల శ్రీనివాస్ లు పతకలను ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో సీపీఎం ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు క్యతరాజు సతీష్, ఐ శంకర్,నల్ల.సత్తి, పల్లి.కృష్ణ అహ్మద్, సత్యనారాయణ, రేణుగుంట్ల. ప్రవీణ్, నేరెళ్ల జోసఫ్, మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Recent Comments