Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుఐనవోలు శ్రీ భ్రమరాంబిక దేవి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు

ఐనవోలు శ్రీ భ్రమరాంబిక దేవి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు

స్పాట్ వాయిస్ , హన్మకొండ రూరల్: ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీ భ్రమరాంబిక దేవి ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. భ్రమరాంబిక దేవి ఆలయంలో ఆదివారం నుంచి విజయదశమి వరకు శైవాగమోక్త ప్రకారంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతీనిత్యం ఒక ప్రత్యేక అలంకారంలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుందన్నారు. ‘నవదుర్గ’ అలంకారాల్లో భాగంగా ఆదివారం శైల పుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. బుధవారం ఉదయం 4గంటలకు శ్రీ భ్రమరాంబిక దేవి అమ్మవారికి సుప్రభాతసేవ, విఘ్నేశ్వరపూజ, శైవశుద్ధి పుణ్యాహవాచనము, పంచగవ్యప్రాశన, ఋత్వికరుణ దీక్షాధారణ, అఖండదీపారాధన త్రిశూలపూజ, అంకురారోపణ, మంటపారాధన అఖండదీపారాధన త్రిశూలపూజ, అంకురారోపణ, మంటపారాధన ప్రధాన కలశస్థాపన, అమ్మవారి నవ కలశస్నపన సుగంధ పరిమళ ద్రవ్యాభిషేకం నవరాత్రి వ్రతారంభం నిత్యాహ్నికం, మహానైవేధ్యం, నీరాజన మంత్రపుష్ప, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు, పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జ్యోషి, అర్చకులు పాతర్లపాటి నరేష్ శర్మ, ఉప్పుల శ్రీనివాస్, మడికొండ దేవేందర్, ఆలయ సిబ్బంది అద్దంకి కిరణ్ కుమార్, తాళ్ళపెల్లి శ్రీకాంత్, శంఖపెల్లి రాజు, భక్తులు కాటబోయిన రవితేజ, అమ్మ వారి దీక్ష తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments