సిరికొండ.. గుండె ధైర్యమై..
బాధితులను పరామర్శిస్తూ..
నేనున్నా ననే ధైర్యాన్నిస్తూ..
స్పాట్ వాయిస్, గణపురం: ఆపదలో ఉన్న వారికి నేన్నానంటూ.., మృతుల కుటుంబాల కన్నీరు తూడుస్తున్నారు ఎమ్మెల్సీ సిరికొండ. ఆపదొచ్చిందంటే పరుగు పరుగున వచ్చి గుండె ధైర్యం అవుతున్నారు. బాధతో నిండిన ఆ ఇంటికి తానున్నానే భరోసానిస్తున్నారు. గణపురం మండలం మైలారం గ్రామంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు గొర్రె రమేష్ మాతృమూర్తి సరోజన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే గ్రామంలో ఇటీవల మరణించిన గోనె రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. రేగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో పల్లెబోయిన లక్ష్మి, ఆకుల, రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. నిజాంపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడిన అమ్మ సదయ్యను పరామర్శించారు. గోరికొత్తపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు సూరబోయిన రాజయ్య ఇటీవల ప్రమాదంలో గాయపడగా వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అందరికీ అండగా ఉఃటానని, ఎవరూ అధైర్య పడొద్దన్నారు.
Recent Comments