కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..
విషమంగా రాజలింగమూర్తి పరిస్థితి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 వార్డ్ కౌన్సిలర్ భర్త నాగవల్లి రాజలింగమూర్తి పై జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ బీఆర్ఎస్ ఆఫీసు ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో రాజలింగమూర్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు పొట్టలో భాగంగా కత్తిపోట్లు భారీగా పడ్డాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై కేసు నమోదు చేసిన రాజలింగమూర్తి.
Recent Comments