కేక్ కట్ చేసి మొక్కలు నాటి..
కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించిన గండ్ర దంపతులు
మున్సిపాలిటీకి స్వచ్ఛ భారత్ వాహనాలను, స్వర్గరథం ప్రారంభం
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి మున్సిపాలిటీలో మంత్రి కల్వకుంట్ల తారక రామరావు జన్మదినం సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కేకు కట్ చేసి మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ వాహనాలను, స్వర్గరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర్, జెడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతిరావు, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్ధూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పీఎసీఎస్ చైర్మన్, పట్టణ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments