Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుషరతులు లేకుండా ధాన్యం కొనాలి.. భూపాలపల్లి జెడ్పీ

షరతులు లేకుండా ధాన్యం కొనాలి.. భూపాలపల్లి జెడ్పీ

భూపాలపల్లి జెడ్పీ సమావేశంలో తీర్మానం
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. బుధవారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ జిల్లాలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా మెజార్టీ సభ్యులు బలపరిచారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ జిల్లాలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలని సభ తీర్మానించిందని, ఈ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా సమక్షంలో వ్యవసాయం, ఉద్యానవన శాఖ, విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ మిషన్, భగీరథ, ఇతర శాఖల అభివృద్ధి పనులపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులను స్థాయీ సంఘాల్లో చర్చించి మండలాల వారీగా కేటాయించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సామాన్య ప్రజానీకానికి సక్రమంగా అందేలా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించిన పనులను అధికారులు సకాలంలో పూర్తి చేసి నివేదికలు అందించాలని అన్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో 60 శాతం విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న 30 శాతం స్కూల్స్ అనగా 149 స్కూళ్లలో ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో ఎంపికైన పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఒక్క పైసా నిధులు కూడా దుర్వినియోగం కాకుండా సాఫ్ట్ వేర్ ద్వారా పనులను గుర్తించి వందశాతం పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అధిక లాభాలను ఇచ్చే ఆయిల్ ఫామ్ పెంపకం పై రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోజిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) టీఎస్. దివాకర, జెడ్పీ సీఈవో శోభారాణి, డిప్యూటీ సీఈఓ రఘువరన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments