Saturday, April 5, 2025
Homeజాతీయంసీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఇదే..

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఇదే..

భారత రాష్ట్ర సమితి
BHARATHIYA RASTRA SAMITHI
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టడం ఖాయంగా తేలిపోయింది. దేశ రాజకీయాల్లో మార్పు కావాలంటూ కేసీఆర్ ఫైట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా థర్డ్ ఫ్రంట్ తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. అయితే బుధవారం హైదరాబాద్ లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ లో సీఎం జాతీయ పార్టీ పై క్లారిటీ ఇచ్చారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలే చాలా మంది ఎమ్మెల్యేలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జాతీయ స్థాయిలో భారతీయ రాష్ట్ర సమితి కూడా ఉండాలంటున్నారని సీఎం కేసీఆర్ ఆశను నర్మగర్భంగా వెల్లడించారు. దేశ అభ్యున్నతి కోసం తెలంగాణ నుంచే తొలి అడుగు పడితే అదే తమకు గర్వకారణం అన్నారు. ఈ దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని, ఎవరినో గద్దెదించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో తాను పనిచేయబోనని స్పష్టం చేశారు. ఇద్దరు సీఎంలతో మాట్లాడి, నాలుగు పార్టీలను జతచేయాల్సిన అవసరమే లేదన్నారు. ప్రజలే ఎజెండాగా ఫ్రంట్లు రావాలన్నారు. అద్భుతమైన దేశ నిర్మాణానికి ప్రక్రియ మొదలు కావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments