బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్
స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్ : హైదరాబాద్ లో బాలికపై లైంగిక దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేవైఎం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ డిమాండ్ చేశారు.. ఈ సందర్బంగా భరత్ గౌడ్ మాట్లాడుతూ.. బాలికపై లైంగిక దాడిక జరిగినా మహిళా కమిషన్ కాని, మహిళా మంత్రులు కాని ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. లైంగిక దాడి చేసిన నిందితులలో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే కుమారుడు, హోం మంత్రి మనవడు ఎవరు ఉన్నా పోలీస్ అధికారులు వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కేసును పక్క దారి పట్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అవసరమైతే బీజేవైఎం ఆధ్వర్యంలో డీజీపి ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
లైంగికదాడి నిందితులను శిక్షించాలి..
RELATED ARTICLES
Recent Comments