విదేశీ కరెన్సీ లభ్యం..
స్పాట్ వాయిస్, కల్చరల్: ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో మంగళవారం హుండీలు లెక్కింపు జరిగినట్టు ఈవో కే.శేషుభారతి తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు అనిల్ కుమార్, ప్రధానార్చకులు భద్రకాళి శేషు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా రూ.45,23,750 ఆదాయం సమకూరిందని, ఆ మొత్తాన్ని దేవస్థానం బ్యాంకు అకౌంట్లో జమ చేసినట్టు చెప్పారు. అలాగే, 512 యూఎస్ఏ డాలర్లు, 5 కెనడా డాలర్లు, 50 ఆస్ట్రేలియా డాలర్లు, ఐదు ఇంగ్లాండ్ పౌండ్లు, 56 దినార్లు మొక్కులుగా వచ్చాయన్నారు. లెక్కింపు కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
భద్రకాళి హుండీ లెక్కింపు..
RELATED ARTICLES
Recent Comments