వల్లెంకుంట కార్యదర్శికి ఉత్తమ సేవా పథకం
స్పాట్ వాయిస్, మల్హర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి,జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ ఫలితాలు సాధించిన మండలంలోని వల్లంకుంట కార్యదర్శి కర్ణకంటి నరేష్ కు ఉత్తమ సేవా పతకం లభించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో నరేష్ కు ఉత్తమ ప్రజా సేవ పథకంతో పాటు 5116 రూపాయల నగదు బహుమతి ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అందజేశారు. తన కి అన్ని విధాలా సహకరించిన వల్లెంకుంట ప్రజలకు, అధికారులకు ఈ సందర్బంగా నరేష్ కృతజ్ఞతలు తెలిపారు.
వల్లెంకుంట కార్యదర్శికి ఉత్తమ సేవా పథకం
RELATED ARTICLES
Recent Comments