Friday, September 20, 2024
Homeక్రైమ్బీరు విత్ వర్క్..

బీరు విత్ వర్క్..

వారెవ్వా.. సారూ.. చిల్..
మానుకోట ఆర్టీఏ ఆఫీసులో ఉద్యోగి నిర్వాకం..

స్పాట్ వాయిస్, బ్యూరో: అది మానుకోట ఆర్టీఏ కార్యాలయం. ఓ అధికారి విధుల్లోనే కూల్ బీర్ తో చిల్ అయ్యాడు. ఆఫీసులో ఇదేం పని అనుకుంటున్నారా..? నిజమేనండి. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాంతీయ ఉద్యోగుల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. వాళ్లు ఏం చేసినా చెల్లుతుందన్న చందంగా పరిస్థితి దాపురించింది. మహబూబాబాద్ రవాణా కార్యాలయంలో ఉద్యోగులు డ్యూటీలో చిల్ అయ్యేందుకు ఏకంగా బీరు బాటిళ్లు టేబుళ్లపై పెట్టుకుని తాగుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆ చిత్రం చూసిన జనం ఆఫీసులో ఇదేం పని సారూ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే విషయంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments